అదే తన హాబీగా మార్చుకుంది. అలా తన చదివిన తొలి పుస్తకం బుడుగు ఇంటర్లో జాయిన్ అయినప్పుడు ఇండియన్ ఎకనామిక్స్, ఇండియన్ బడ్జెట్ కు సంబంధించిన వార్తలను ఎక్కువగా వినటం చదవడం చేస్తూ ఉండే దాన్ని ఎప్పటికైనా భారత రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పని చేయాలని కలలు కనేదాన్ని. అలాగే ముంబైలో డిగ్రీ చదివేటప్పుడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయడం మొదలుపెట్టా.ఇక మా చెల్లి సమంత తను నా సోల్‌మేట్. ఈ మధ్యనే సమంతకు పెళ్లైంది. సినిమాలు,షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉన్నా. సమంతపెళ్లిలో మళ్ళి అందర్నీ కలుసుకున్నా.
పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు భక్తి ఎక్కువే. ఉదయాన్నే పూజ చేయడం, సూర్యాష్టకం చదవడం అలవాటు . నేను పూర్తీ శాకాహారిని. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు ఎంతిష్టమో. చిన్నప్పట్నుంచీ అమ్మ కావాలనే కోరిక ఉండేది. అమ్మా అని పిలిపించుకోవడం, మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి. చైతూ విషయాని కొస్తే చాలా మర్యాదస్తుడు చాలా మంచివాడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఈ క్వాలిటీస్ చైతూతో నాను ప్రేమలో పడేలా చేసాయి. అంటూ శోభత చేప్పుకు వచ్చింది.