పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి అనే మూవీలకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు మూవీ ని మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్ , బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి పవన్ ఆ మూవీ లను కూడా పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని పవన్ మొదలు పెట్టి కూడా చాలా కాలమే అవుతుంది. అలాగే ఓజి మూవీ ని మొదలు పెట్టి కూడా చాలా కాలమే అవుతుంది.

ఇలా ఈ మూడు మూవీ లను మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో ఫుల్ బిజీ కావడంతో ఈ మూవీ లు కాస్త సైడ్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పవన్ తిరిగి మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి ఈ మూడు మూవీ లలో కూడా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అందుకు ప్రధాన కారణం ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం. దానికి తమన్ అద్భుతమైన బ్యా గ్రౌండ్ స్కోర్ ను అందించడం. వరుణ్ తేజ్ తాజాగా మట్కా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బృందం తాజాగా ఓ ఈవెంట్ ను నిర్వహించింది. అందులో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది. సుజిత్ నాకు ఒక సమయంలో ఆ మూవీ కథను చెప్పాడు. అది నాకు అద్భుతంగా నచ్చింది. సినిమా వచ్చింది అంటే బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అని చెప్పుకొచ్చాడు. ఇలా ఓజి మూవీ గురించి వరుణ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్క సారిగా జనాల్లో పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: