సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్నే అందిస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఇప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వివిధ రకాల జానర్స్ లో డిఫరెంట్ కాన్సేప్ట్ లతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఎక్కువగా క్రైం థ్రిల్లర్ సినిమాను ఎక్కువగా ఇష్టపడతారనే చెప్పవచ్చు. ఎందుకంటే.. థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికి ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను చాలానే మెప్పించాయి. కాగా, అలాంటి వాటిలో ‘దండుపాళ్యం’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ రాజు తెరకెక్కించారు. అయితే 2012లో వచ్చిన ఈ సినిమా కన్నడ భాషల్లో మొదట కన్నడలో భాషలో తెరకెక్కింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా విడుదల చేశారు.ఇకపోతే ఈ క్రైమ్ థ్రిల్లర లో పూజా గాంధీ,రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్ అలాగే రఘు ముఖర్జీ నటించారు. అయితే ఈ సినిమాని దండుపాళ్య అనే పేరు మోసిన ముఠా నిజ జీవితంలోని దోపిడీల ఆధారంగా రూపొందించారు.కాగా, అప్పటిలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కూడా రాబెట్టింది. ఇక ఈ సినిమా ఫ్రాంచైజీలో నాలుగు భాగలుగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పూజా గాంధీ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడిసిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా బోల్డ్ గా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసింది ఈ చిన్నది. అయితే ఇలా చాలా సినిమాల్లో నటించిన అలరించిన పూజ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు.

పూజా గాంధీ ఎక్కువగా కన్నడ ల్లోనే నటించింది. అలాగే తమిళ్, తెలుగు భాషల్లోనూ కొన్ని లు చేసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా దండు పాళ్యం తోనే బాగా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార.కాగా తన పదేళ్ల కెరీర్ లో సుమారు 50 సినిమా ల్లో నటించింది పూజా గాంధీ. అయితే 2021 తర్వాత ఈ అందాల తార పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె చివరిగా దండుపాళ్యం 3 లో కనిపించింది. ఇక గతేడాది నవంబర్ లో ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేను పెళ్లి చేసుకుంది పూజా గాంధీ.సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. దండుపాళ్యం లో మొరటుగా, బోల్డ్ గా కనిపించిన పూజా గాంధీ నిజ జీవితంలో మాత్రం ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అసలు ఈమె దండుడుపాళ్యం పూజా గాంధీనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: