టాలీవుడ్ లో నిర్మాతలుగా మగరాయుళ్ళ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో లేడీ నిర్మాతగా ఇండస్త్రీలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా మొట్ట మొదటి సినిమానే ‘పంజా’ పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసింది లేడీ నిర్మాత నీలిమ తిరుమల శెట్టి.ఈ నేపథ్యంలో పంజాబీ రిలీజ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిర్మాత నీలిమ తిరుమల శెట్టి.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు హిట్స్ తో పాటుగా ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్లాప్ చిత్రాల్లో కూడా సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలూ ఉన్నాయి. వాటిలో పవన్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ చిత్రం “పంజా” కూడా ఒకటి. దర్శకుడు విష్ణు వర్ధన్ తో చేసిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని అప్పట్లోనే సాధించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గానే నిలిచింది.

అయితే ఈ సినిమాకి కూడా నెమ్మదిగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలా ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం నిర్మాత నీలిమ తిరుమల శెట్టి సాలిడ్ హింట్ ని అందించారు. నిన్న రాత్రి ఓ పార్టీలో తాను పాల్గొనగా అక్కడ బ్యాండ్ పంజా సాంగ్ ని ఆలపించడం జరిగింది.రీ రిలీజ్ బహుశా ఇది విశ్వం తనకు చేస్తున్న ఓ సూచన కావొచ్చంటు ఆమె పోస్ట్ చేసారు.మరి ఈ వైబ్స్ తో లేటెస్ట్ గా పంజా రీ రిలీజ్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీనితో పవన్ అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. నార్మల్ టైం లో కాకుండా పవన్ బర్త్ డే కానుకగా వచ్చే ఏడాదికి గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలని కోరుతున్నారు. మరి ఈ క్రేజీ స్టైలిష్ యాక్షన్ డ్రామా ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

ఇదిలావుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న అవి ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పంజా. ఈ సినిమాలో పవన్ లుక్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కేలా చేసింది. అప్పటివరకు రఫ్ లుక్ లో కనిపించని పవన్ .. ఈ మూవీలో గడ్డం పెంచి కేకపుట్టించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. పవన్ లుక్, యాక్షన్ సీన్స్ ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుంటాయి. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో అడవి శేష్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సారా జేన్ డయాస్ నటించింది. ఈ అమ్మడు తెలుగులో నటించిన ఎకైక సినిమా ఇది. ఈ సినిమాలో సారా అమాయకత్వం, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: