సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటి నటులు ఇతర హీరోలపై లేదా దర్శకులపై , నిర్మాతలపై ఉన్న అభిమానంతో ఏ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొన్ని పాత్రలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించిన ప్రియమణి కూడా ఒక నటుడిపై అభిమానంతో ఆయన సినిమాలో ఆఫర్ రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆయన సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు ..? ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకున్నాం.

కొన్ని సంవత్సరాల క్రితం షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా చెన్నై ఎక్స్ ప్రెస్ అనే హిందీ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియమణి ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఈ ముద్దు గుమ్మ ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదట. షారుక్ ఖాన్ అంటే ప్రియమణి కి ఎంతో అభిమానం అంట. దానితో ఆయన సినిమాలో ఆఫర్ రావడంతో ఆ మూవీ లో నటించినందుకుగాను ఏ మాత్రం పారితోషకం తీసుకోలేదట. ఇకపోతే చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

అలాగే ఈ మూవీ లోని ప్రియమణి ఐటమ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ "జవాన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా ప్రియమణి కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలా తన అభిమాన నటుడు అయినటువంటి షారుక్ ఖాన్ సినిమాలో ఆఫర్ రావడంతో ప్రియమణి ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోకుండా చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: