యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ భారీ విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతి కూడా పెంచుతూ ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలో అయినప్పటికీ కూడా ప్రభాస్ సినిమా అంటే బయ్యర్లు కూడా  కొనడానికి ఇష్టపడతున్నారట.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఈ యేడాది కల్కి చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సలార్-2 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటు అభిమానులు చాలా ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఒక క్రేజీ లీక్స్ వైరల్ గా మారుతున్నాయి.



డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. గత ఏడాది సలార్ సినిమాతో ప్రభాస్  భారీ విజయాన్ని అందుకోవటంతో సీక్వెల్ని కూడా శౌర్ర్యాంగాపర్వం అనే టైటిల్ తో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గత ఏడాదిని కొంత భాగం షూటింగ్ పూర్తి అయినట్లుగా కూడా చిత్ర బృందం వెల్లడించింది. సలార్ సినిమా చివరిలో ట్వీట్ కూడా అందరిని ఆకట్టుకుంది. తాజాగా టెక్నికల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని లీక్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


దీంతో అభిమానులు ఈ ఫోటోలు చూసి సలార్-2 సినిమా షూటింగ్ మొదలవుతోందనే విధంగా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్ కంటే మరొక క్రేజీ ఫైట్ ఉండబోతున్నట్లు టాక్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కానీ ఈ లీక్స్ పైన మాత్రం ఇప్పటివరకు చిత్ర బృందం ఏ విధంగా స్పందించలేదు. ప్రభాస్ షాడో పిక్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఏదో కత్తి పట్టుకొని  ప్రభాస్ తోపాటు మరి కొంతమందికి వివరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి రెండో భాగాన్ని ముందుగా తెరకెక్కిస్తారా లేకపోతే ఎన్టీఆర్ సినిమా అయిపోయినిచ్చి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్- 2 తీస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: