ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో కత్రినా కొంచెం బొద్దుగా పదే పదే తన పొట్టను దాచుకుంటూ కనిపించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాను ప్రెగ్నెంట్ కాలేదని.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే అందరికీ చెబుతాను అంటూ తనపై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది. అయితే ఇప్పుడు కత్రినా కైఫ్ గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్గా కత్రినా అందమైన చీరలో కనిపించి తెలుక్కున మెరిసింది. అయితే అక్కడ ఆమె చేతికి నల్లని బ్యాజ్ ఒకటి కనిపించింది. ఇప్పుడు దాని గురించి బాలీవుడ్ మీడియాలో ఎంతో రచ్చ చర్చ జరుగుతుంది. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి బ్యాజ్ ఫ్యాషన్కు సంబంధించింది కాదని నిజానికి అది డయాబెటిస్ బ్యాజ్ అని వైద్య నిపుణులు అంటున్నారు.
బ్లడ్ షుగర్ మానిటర్ బ్యాజ్ అని వైద్యులు తెలిపారు. మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు దీన్ని వాడుతారని వైద్యులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయి తగ్గాయా.. పెరిగాయా? ఈజీగా తెలుసుకొని అలర్ట్ అవ్వడానికి డయాబెటిస్ ప్యాచ్‌లు ఉపయోగపడుతాయని వైద్యులు అంటున్నారు.కత్రినా కైఫ్ మానిటర్ ప్యాచ్ ధరించి కనిపించడంతో ఆమె బ్లడ్ షుగర్ బాధపడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో కత్రినా ఆరోగ్యంపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మానిటర్ ప్యాచ్‌పై కత్రినా క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి రుమర్స్ తెర మీదకు వస్తునే ఉంటాయి.