బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే రీసెంట్ గానే ఓ పండండి  ఆడపిల్లకు జన్మించింది. ఇకప్ర‌స్తుతం ఆమె కూతురు అలనా పాలన చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె సినిమాలుకు టైం కేటాయించే అవకాశం అయితే లేదు. మరో సంవత్సరం వరకు కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోబోతుంది. ఆ తర్వాత తన తర్వాత సినిమాల పైన దృష్టి పెట్టనుంది. వాటిలో ముఖ్యంగా కల్కి పార్ట్ 2 .. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే సంవత్సరం చివర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


కల్కి2898AD ఇదే దీపికా ఫస్ట్ తెలుగు మూవీ కావటం కూడా విశేషం.. ఇక ఈ సినిమాలో ఈమె కల్కి కి జన్మనివ్వబోయే సుమతి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకు ముందుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా రూ.1150 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అదే విధంగా ఇదే సంవత్సరం దీపిక ఫైటర్ , కల్కి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది  ఇక డిసెంబర్లో ఆమే నటించిన సింగం అగైన్ సినిమా కూడా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది.  ఇలా ఈ ఏడాది ఈ మూడు సినిమాలతో ఇండియన్ లో 1000 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాలలో నటించిన హీరోయిన్‌గా మారబోతోంది. గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్ లో దీపికా ఇప్పటికే ఒకసారి చేరింది. మరల ఈ ఏడాది రిలీజ్ అయిన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ 205 కోట్ల కలెక్షన్స్ ని ఇండియాలో అందుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ డిజాస్టర్ గా నిలిచింది.


పాన్ ఇండియా హీరో ప్రభాస్ కల్కి మూవీ రూ.  650 కోట్లకు పైగా కలెక్షన్లు ఇండియాలో సాధించింది ఈ రెండు సినిమాలు మొత్తం కలెక్షన్స్ 800 కోట్లపైగా ఉన్నాయి ఇక డిసెంబర్లో రిలీజ్ అయ్యే సింగం అగైన్ మూవీ ఇండియాలోనే కేవలం రూ.300 కోట్ల పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచున వేస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇండియాలోనే రూ.1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోయిన్గా దీపికా రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు ఇలా రెండు సార్లు 1000+ కోట్లకి వసూళ్లు అందుకున్న హీరోయిన్స్ ఇండియాలో ఎవరు లేరు. అందుకే దీపికా పదుకునేకి 2023, 2024 సంవత్సరాలు చాలా స్పెషల్ అని అంటారు. మరల కల్కి పార్ట్ 2 2026 లేదా 2027లో రిలీజ్ అయ్యే చాన్స్‌ ఉంది. క‌ల్కి2తో మరోసారి దీపికా పదుకునే రూ.1000 కోట్ల కలెక్షన్స్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: