దివంగత లెజెండ‌రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు అనే ఓ సినిమా తీశారు. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే కాదు భారతదేశ సినిమా చరిత్రలోనే గొప్ప మహాకావ్యంగా నిలిచిపోయింది. ఆ తర్వాత నాగేశ్వరరావు దేవదాస్‌ని చూసి.. కృష్ణ కూడా దేవదాసు సినిమా తీశారు. కృష్ణ తీసిన దేవదాసు సినిమా డిజాస్టర్ అయింది. ఈ క్రమంలోనే 1978లో ఓ సంఘటన జరిగింది. అప్పటికే అనార్కలి మీద చాలా భాషలలో చాలా సినిమాలు వచ్చాయి.


1978లో అక్బర్ సలీం అనార్కలి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కథా, రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్టీ రామారావు.. సినిమా బాగా ఆడలేదు. ప్రేక్షకులకు నచ్చలేదు. కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్టు ఈ సినిమా ప్లాప్ అవ్వటానికి చాలా కారణాలే ఉన్నాయి. అప్పటికే హిందీలో మొగల్ ఏ అజం పేరుతో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇక 1955లో అంజలి పిక్చర్స్ బ్యానర్ పై మన తెలుగు అనార్కలి తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది. ఎస్వీ రంగారావు, అంజలీదేవి, అక్కినేని నటన అదరగొట్టేసింది.


సినిమా వచ్చిన 23 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్‌కు కూడా అనార్కలి మీద సినిమా తీయాలన్న ఆలోచన రావడంతో.. సినిమా తెరకెక్కించారు. పాటలు, మాటలు అన్ని సి.నారాయణరెడ్డి రాశారు. సిపాయి ఓ సిపాయి పాట ఒకటే బాగా హిట్ అయింది. మహమ్మద్ రఫీ, సుశీలమ్మ ఈ పాట పాడారు. సలీమ్ గా.. బాలకృష్ణ, అనార్కలిగా.. దీప, జోధాగా జమున, తాన్సేన్గా.. గుమ్మడి, గున్నారుగా.. మాధవి , జోధా మేనల్లుడుగా.. శ్రీధర్ నటించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా ఎక్కినా ఓవరాల్ గా అయితే అంచనాలు అందుకోలేదు. ఈ విషాద ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. అలా బాలకృష్ణ కెరీర్లో ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో పాటు చేదు అనుభవం మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: