తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డు ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా మారబోతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా వైల్డ్ కార్డు ఎంట్రీలో న్యూ సెలబ్రిటీస్ ను పరిచయం చేస్తారు. కానీ., ఈసారి వెరైటీగా మాజీ కంటెస్టెంట్ ను మళ్ళీ హౌస్ లోకి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్ లోకి హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, మెహబూబ్, అవినాష్, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణిలు వైల్డ్ కార్డు ఎంట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రతి వారం లాగే నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది.

ఈ క్రమంలోనే యష్మిని హరితేజ నామినేట్ చేసింది. ముందుగానే హరితేజకు యష్మి ఆటపై మంచి అభిప్రాయం లేదని., ఈ విషయాన్ని ఆమె నేరుగా నాగార్జునతో వేదిక పైనే తెలిపింది. అంతేకాకుండా., హరితేజ కూడా యష్మి పేరు కూడా చెప్పేసింది.. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మెజారిటీ కాంటెస్ట్ యష్మిని నామినేట్ చేశారని తెలుస్తుంది.. ఆమెకు అత్యధికంగా వ్యతిరేక.. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన అనంతరం నామినేషన్ లిస్టులో గంగవ్వ, యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సీత, మెహబూబ్ ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అయితే., ఈ క్రమంలో వారంలో హౌస్ నుంచి వెళ్ళిపోయే ప్రక్రియలో గంగవ్వ అని చెవులు కోరుకుంటున్నారు.  

ఇక మరికొందరు అయితే గంగవ్వ హౌస్ లో ఉంటే మిగతా కంటెస్టెంట్స్ గేమ్ కు డిస్టబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మొదటి వారమే ఆమెను ఇంటికి పంపే అవకాశం ఉన్నట్లు బిగ్ బాస్ షోలో చాలా ఎనిమినేషన్లు ప్రేక్షకుల అభిప్రాయాన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక హౌస్లో మరొక స్ట్రాంగ్ కంటెంట్ ఎవరు అంటే విష్ణు ప్రియ. ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రతిసారి కూడా ఆమె టాప్ 3 లో ఉండడం విశేషం. ఈ క్రమంలో యష్మికి కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే ఉంది. అయితే, ఎలిమినేట్ అయ్యే స్థాయిలో లేదు కానీ ఆమెకు పరోక్షంగా మద్దతు కూడా లభిస్తుంది. ఇక మహబూబ్, సీతా, పృధ్విరాజ్ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు.  కనుక ఒక అంచనా ప్రకారం ఈ వారం గంగవ్వను హౌస్ నుంచి బయటకు ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి చివరికి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: