మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ మూవీ తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో డీసెంట్గా నడుస్తుంది. ఇదే క్రమంలో కోలీవుడ్ లో ఈ మూవీ నిరాశపరిచింది. దీంతో తమిళ ప్రేక్షకులు ఇతర భాష హీరోల సినిమాలను ఎక్కువగా చూడరని ఈ సినిమాతో మరోసారి రుజువు అయింది. ఇదే క్రమంలో దేవర కోలీవుడ్ లో రూ.8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే చేసింది. అలాగే ఓవర్సీస్ తమిళ్ వెర్షన్ లో కూడా 15వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది.


ఎన్టీఆర్ ఎంతో కష్టపడి ఐదు భాషల్లో ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అయినా కూడా తమిళ ప్రేక్షకులు ఎప్పటిలాగే తెలుగు హీరోల సినిమాలకి ఆసక్తి చూపించడం లేదు . అందుకే ఇక నుంచి వచ్చే సినిమాలను దర్శక , నిర్మాతలు మన సౌత్ భాషల్లో విడుదల చేయటం కంటే తెలుగు , హిందీ భాషల్లోనే దృష్టి పెట్టి ఈ రెండిటిలోనే విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.అంతేకాక కొరటాల శివ సినిమా అంటేనే కమర్షియల్ తో పాటు మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఇప్పుడు దేవరను కూడా అదే ఫార్ములాతో తెచ్చాడు. ఇక్కడ ప్రతి మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలి.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్.


మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది ‘దేవర’ కథ. ఈ చిన్న‌ లైన్‌పైనే సినిమా అంతా తీశాడు కొర‌టాల‌. అందులో కొన్ని ఎత్తులున్నాయి .. మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసికెళ్లాడు దర్శకుడు కొరటాల. సో ఇలాంటి ఫార్ములా తమిళ్ ఆడియెన్స్ కి నచ్చదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: