ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన ఉగ్రం అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో కన్నడ సినీ పరిశ్రమలో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే పాన్ ఇండియా మూవీ ని రూపొందించాడు.

మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రశాంత్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఇకపోతే కే జీ ఎఫ్ చాప్టర్ 1 లో ఓ ఐటెం సాంగ్ ఉంటుంది. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఈ ఐటెం సాంగ్ అద్భుతమైన రీతిలో సక్సెస్ అయింది. అలాగే ఈ సాంగ్ ద్వారా తమన్నా కి కూడా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. తర్వాత ప్రశాంత్ సలార్ పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ "సలార్ 2" సినిమాను రూపొందిస్తున్నాడు.

అలాగే మరి కొంత కాలంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను చేయబోతున్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఫార్ములాను ఫాలో కాబోతున్నట్టు తెలుస్తుంది. అదేమిటి అనుకుంటున్నారా ..? కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. దానికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాలో కూడా ప్రశాంత్ ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్లు అందులో సమంత నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే సమంతసినిమా ఐటెం సాంగ్ లో నటిస్తే ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: