యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దేవర సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా తర్వాత ఏ హీరో నటించిన సినిమా కూడా హిట్ కాలేదు. దానితో దేవర మొదటి భాగం కూడా విజయం సాధించడం చాలా కష్టం. ఇక ఇప్పటికే ఆచార్య మూవీ ఫ్లాప్ తో కష్టాల్లో కోరుకుపోయినా కొరటాలసినిమా కూడా ప్లాప్ అయితే మరింత కష్టాల్లోకి వెళ్లి పోతాడు అనే వార్తలు వచ్చాయి. దేవర సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను కనబరుస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఈ సినిమా హిట్టు వల్ల కొరటాలకు ఒక రకంగా ఆనందం ఉన్న మరో రకంగా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా ... దేవర సినిమా మంచి విజయం సాధించింది. ఇక వెంటనే దేవర 2 మొదలు పెట్టేద్దాం అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

అలాగే ప్రశాంత్ నీల్ మూవీ కి కమిట్ అయి ఉన్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి అయ్యాకే దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక దేవర రిజల్ట్ ఏమైనా తేడా కొడితే మొత్తంగా దానిని పక్కన పెట్టి కొరటాల వేరే మూవీని స్టార్ట్ చేసేవాడేమో. కానీ ఇక దేవర అద్భుతమైన విజయం సాధించింది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే వరకు కేవలం దేవర పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులపై కొరటాల సమయాన్ని కేటాయించనున్నట్లు అలా ఆయన చాలా సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉన్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: