‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రోహిణి కూడా ఒకరు. ఇక ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్‌లో స్మైల్ వస్తుంది. ఎందుకంటే తన నటనతో , కామెడీ టైమిగ్స్‌తో అంతలా ఆకట్టుకుంది రోహిణి. ఈమె కెరీర్ స్టార్టింగ్‌లో సీరీయల్స్ నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత పాపులారిటీ అయితే రాలేదు. తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ రియాలీటీ షోలోకి వెళ్లే అవకాశాన్ని సంపాదించుకున్నది. దీంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇలా ఓ పక్కా పలు షోలు, మరో పక్కా వెబ్ సీరీస్‌లు చేస్తు బిజీ బిజీగా ఉంటుంది.

 అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది రోహిణి. ఇదిలా ఉంటే తాజాగా రోహిణి ని బిగ్ బాస్ 8 టీం ఇటీవలే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావాలని రిక్వెస్ట్ చేసారు. దీనికి ఆమె వెంటనే ఒప్పుకుంది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే డిమాండ్ చేసింది, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈమెకు బిగ్ బాస్ టీం వారానికి 4 లక్షల రూపాయిలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈమె ఎంటర్టైన్మెంట్ విషయం లో అసలు ఢోకా లేదు, ఈమెకు ఉన్నటువంటి టైమింగ్ హౌస్ లో అవినాష్ కి కూడా ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఇకపోతే గతం లో రోహిణి బిగ్

 బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. హౌస్ లో ఉన్నప్పుడు ఈమె ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ, టాస్కులు ఆడడంలో కానీ తన తోటి కంటెస్టెంట్స్ తో ఒక రేంజ్ లో పోటీ పడేది. అయితే హౌస్ లో ఎక్కువగా వెనక చేరి మాట్లాడుతుండడం, గుసగుసలు ఎక్కువ అవ్వడంతో కాస్త నెగటివిటీ ని సంపాదించింది రోహిణి. ఫలితంగా ఆమె 7 వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన రోహిణి ఏం చేస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: