ఈ రీసెంట్ టైమ్స్ లో సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్టుల సంఖ్య బాగా పెరిగిపోతుంది .. ప్రతి సినిమాలోను ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పుట్టుకొస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే వ‌రుస‌ అవకాశాలు అందుకుంటూ స్టార్‌డం ను తెచ్చుకుంటున్నారు. అలానే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ తెచ్చుకున్న నటుల్లో గోపరాజు రమణ కూడా ఒకరు. సినిమాల్లో ఆయన టైమింగ్ మరో లెవెల్ లో ఉంటుంది . అయిన స్క్రీన్ పై కనిపించాడంటే చాలు ఆటోమేటిక్ గా నవ్వు మొహం పై వచ్చేస్తుంది . మరి ముఖ్యంగా ఈయన పేరు చెప్పగానే .. అందరికీ మిడిల్ క్లాస్ మెలోడీస్‌ సినిమానే గుర్తొస్తుంది.


ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రి గా నటించారు రమణ. ఈ సినిమాలో ఆయన నటించారు అనటం కంటే జీవించారని చెప్పాలి. నిజానికి రమణ 2004 లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అష్టా చమ్మా , గోల్కొండ హై స్కూల్ , బెట్టింగ్ బంగార్రాజు , ఓనమాలు , గౌతమీపుత్ర శాతకర్ణి ఇలా పలు సినిమాల్లో నటించారు. కానీ ఈయనకు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు . ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. 72 ఏళ్ల వయస్సు లోనూ త‌న‌ పాత్రల్లో పెర్ఫామెన్స్ తో చించి ఆరేస్తున్నాడు .  కొన్ని సినిమాల కు డేట్స్ కూడా కేటాయించలేని పరిస్థితి వచ్చేసిందట.


అయితే గోపరాజు రమణ కొడుకు కూడా టాలీవుడ్ లో క్రేజీ ఆటర్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఆయన పేరు గోపరాజు విజయ్.. ఈయ‌న‌ కూడా గుంటూరు కారం తో పాటు ఆరంభం , బృంద , మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇలా ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిజీ నటులుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: