జానీ మాస్టర్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అవ్వడంతో అవార్డు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.. దాంతో పెద్ద షాక్ తగిలింది. ఓవైపు అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ మంజూరు చేసిన కోర్టు మళ్లీ అవార్డు నీ తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆ బెయిల్ ని కూడా నిలిపివేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న జానీ మాస్టర్ గురించి ఓ లేడీ కొరియోగ్రాఫర్ తల్లి సంచలన కామెంట్స్ చేసింది. తన కూతుర్ని జానీ మాస్టర్ దగ్గరికి వెళ్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందట. మరి ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరయ్యా అంటే తాజాగా బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ నైనిక.. బిగ్బాస్ 8లోకి పటాకాలాగా  ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఈ ముద్దుగుమ్మ తన సత్తా చూపించింది.ఆ తర్వాత క్రమక్రమంగా ఆట తగ్గిపోవడంతో ఓట్లు తక్కువ పడ్డాయి. 

ఫలితంగా ఆమెని హౌస్ నుండి బయటికి పంపించారు. అయితే బిగ్బాస్ లో ఉన్న సమయంలోనే నైనిక తల్లి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి తన కూతురు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. అలా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నైనిక తల్లి మాట్లాడుతూ.. మా నైనిక డాన్స్ చూసి చాలా అవకాశాలు వచ్చాయి. అలా జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ దగ్గర కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం ఆమెకు వచ్చింది.కానీ జానీ మాస్టర్ దగ్గర అవకాశం వస్తే శశి మాస్టర్ వద్దని చెప్పారు. అందుకే నేను నా కూతుర్ని పంపించలేదు.అంతే కాదు నైనిక ప్రస్తుతం హీరోయిన్ అవ్వాలి అనుకుంటుంది.

ఇక బిగ్బాస్లో అవకాశం వచ్చిన సమయంలో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది ఒకందుకు మంచిదే అనిపించింది. ఎందుకంటే ఇలా అయినా ఫేమస్ అవ్వచ్చు అని నైనిక అనుకుంది. ఓ వైపున నటిగా అవకాశాలు వెతుక్కుంటూనే మరోవైపు ఛాన్స్  వచ్చినప్పుడల్లా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తుంది అంటూ నైనిక తల్లి ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. అయితే ఆ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ దగ్గర అవకాశం వచ్చినా తన కూతుర్ని వేరే మాస్టర్ వెళ్ళద్దని చెప్పడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ నిజస్వరూపం శశి మాస్టర్ కి తెలిసే నైనికను జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అవ్వద్దని చెప్పారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు పలువురు నెటిజన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: