\ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కైనా ఆ తర్వాత సినిమాతో భారీ డిజాస్టర్ రావటం అనేది సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు రీసెంట్గా దేవరతో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ వేశాడు. ఇక సినిమాలో దమ్ము ఉంటే బాక్సాఫీస్ దగ్గర సెంటిమెంట్లో పనిచేయవని ప్రూవ్ చేశాడు యంగ్ టైగర్. అంతే కాకుండా గతంలో మూడుసార్లు రాజమౌళి సెంటిమెంట్‌కు బలైన ఎన్టీఆర్ ఈసారి దాన్ని చాచిపెట్టి కొట్టాడు. అంతేకాకుండా గతంలో ఎన్టీఆర్ తండ్రి - కొడుకులుగా డ్యూయల్  చేసిన ఆంధ్రావాలా, శక్తి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలాయి. ఇప్పుడు దేవరలో కూడా తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటించారు. దీంతో ఎన్టీఆర్ రెండు సెంటిమెంట్లను బ్రేక్ చేశాడు.


త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు తొలి సోలో పాన్ ఇండియా సినిమా కూడా ఇదే.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి కలెక్షన్లు కూడా రాబడుతుంది. అదేవిధంగా బాలీవుడ్ లో అయితే ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. మొత్తంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకోవటం అనేది మామూలు విషయం కాదు. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా తొలి సోలో హిట్ను అందుకుని పాన్ ఇండియా టెస్ట్ పాస్ అయ్యాడు. ప్రధానంగా దేవర కోసం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు ఎన్టీఆర్.. ఆయనకు ఇది కలిసి వచ్చిన అంశామ‌న్ని కూడా చెప్పాలి.


ఇలా మొత్తంగా సోలో హీరోగా ఎన్టీఆర్‌కు హిందీలో ప్రభాస్ తర్వాత మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే కోలీవుడ్ లో మాత్రమే ఈ సినిమా కాస్త పుంజూకోవాలి. మొత్తంగా విడుదలైన అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక ఏదేమైనా బాలీవుడ్ లో మాత్రం సోలో హీరోగా ఎన్టీఆర్ తనష్టామా ఏంటో దేవరాతో అక్కడ హీరోలకి చూపించాడు. త్వరలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. మరోవైపు ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో పూర్తి స్థాయి మార్కెట్ ను సొంతం చేసుకోవడం పక్కా చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: