ఈ సినిమా ఎడిటింగ్ లో రజనీకాంత్ వేలు పెట్టారని.. సిజే వర్కు సరైన టైమ్ ఇవ్వలేదని.. సెకండాఫ్ మొత్తం మార్చేశారని.. అలాగే అనుష్క పాటతో పాటు క్లైమాక్స్‌లో కీలకమైన విషయం కూడా ఆయన తొలగించారు అన్నది రవికుమార్ ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఇక సినిమాలో కృత్రిమ బెలూన్ జంపింగ్.. సన్నివేశాన్ని కూడా రజిని పెట్టారని రవికుమార్ విమర్శించారు. ఇది సినిమా చూసేవారిని తీవ్ర గందరగోళానికి గురి చేస్తుందని.. ఇక లింగా సినిమాను పూర్తి చేయడానికి కావాల్సినంత టైం కూడా తనకు ఇవ్వలేదని.. ఆయన ఆరోపించారు.
రజనీకాంత్ పుట్టినరోజు అయిన 12 డిసెంబర్ 2014న విడుదల చేయాలన్న హడావుడితో సినిమాను గందరగోళంగా ముగించేసారని.. సినిమా నిర్మాణ సంస్థ కూడా సినిమాను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలని తనపై ఒత్తిడి తేవడంతో ఇవన్నీ కలిసి లింగా ప్లాప్ అవ్వటానికి కారణమని విమర్శించారు రవికుమార్.
ఇక లింగా సినిమా డిజాస్టర్ అయ్యాక సినిమా పంపిణీ చేసిన వర్గాలు అందరూ కలిసి లబోదిబోమన్నారు. చివరికి చెన్నైలో పంపిణీదారులు అందరూ కలిసి ధర్నా చేశారు.
చాలా రోజులపాటు నిరసన దీక్షలు చేశారు. అయితే రజనీకాంత్ వారిలో కొందరిని పిలిచి తన రెమ్యూనరేషన్‌లో సగం వెనక్కి ఇచ్చేశారు. ఇక రజనీకాంత్ గొప్ప హీరో.. ఒక దర్శకుడు పనిలో వేరు పెట్టారంటే.. ఆ దర్శకుడు పనితనం నచ్చలేదా అన్న కోణం కూడా ఇప్పుడు చర్చకి వస్తోంది. ఏదైనా కేఎస్ రవికుమార్ ఒకప్పుడు మంచి డైరెక్టర్. అయిన ఆ తర్వాత వరుస డిజాస్టర్ లు ఇస్తూ.. అవుట్ డేటెడ్ అయిపోయారు. బాలయ్యతో రూలర్ లాంటి అతిపెద్ద డిజాస్టర్ సినిమా కూడా రూపొందించారు.