ఈ మూవీ కథ క్లిష్టంగా అనిపించినా ఎమోషనల్ టచ్ మిస్ కాకుండా దర్శకుడు హసిత్ గోలి ఈ మూవీని నడిపించిన తీరు పై ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే లో కన్ఫ్యూజన్ కాస్త తగ్గించి జాగ్రత్తగా తీసి ఉంటే ఈ మూవీ ‘మనం’ రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ గా మారి ఉండేది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
‘స్వాగ్’ మూవీలో శ్రీవిష్ణు నాలుగు విభిన్న పాత్రలలో నటించడమే కాకుండా ఆపాత్రలకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా చూపించడంతో ఈమూవీ ద్వారా శ్రీవిష్ణు తన కెరియర్ లో నాలుగు డిఫరెన్స్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడంతో ఈమూవీ కలక్షన్స్ పై అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ వీకెండ్ కూడ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ హవా కొంతవరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తూ ఉండటంతో ఎంతమంది శ్రీవిష్ణు కోసం ఇలాంటి డిఫరెంట్ కథలను ఎంజాయ్ చేయడానికి ధియేటర్లకు వస్తారు అన్న సందేహం కొందరిలో ఉంది. గతంలో కమలహాసన్ ‘దశావతారం’ సినిమాలో 10 క్యారెక్టర్స్ లో కనిపించి నటన పరంగా ఎన్నో అవార్డులు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీవిష్ణు కూడ కమలహాసన్ అడుగు జాడలలో పయనిస్తూ డిఫరెంట్ పాత్రలను చేస్తూ ఉండటంతో రానున్న రోజులలో మంచి నటుడుగా శ్రీవిష్ణు సెటిల్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈ యంగ్ హీరో నటుడుగా రాణిస్తూ ఒకొక్క మెట్టు ఎక్కుతున్నప్పటికీ తన సినిమాల కలక్షన్స్ విషయంలో ఇంకా వెనకపడి ఉండటంతో అతడికి ఒక సాలిడ్ హిట్ రావాలి..