టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో రవితేజ ఒకరు. మెగాస్టార్ తర్వాత ఇండస్ట్రీలో అంతటి గౌరవం దక్కింది ఆయనకే. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు రవితేజ. చాలా చిన్న పాత్రలు చేస్తూ అన్ని అవమానాలు భరిస్తూ ఆ స్థాయికి వచ్చిన రవితేజ ఇప్పుడు మాత్రం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అది అతను భరించలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు.
ఈ మాస్ మహారాజా క్రాక్ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాని తర్వాత అతడి రేంజ్ వేరే లెవెల్ కి చేరుకుంది. రవితేజ మార్కెట్ ఆ సినిమా అనంతరం అమాంతం పెరిగింది. దీని తర్వాత వచ్చిన ధమాకా (2022) సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో రవన్న రేంజ్ హేమాస్ హీరో అందుకోలేని స్థాయికి ఎదిగింది. ఇక ఈ హీరోకి తిరుగులేదు అనుకుంటున్నా సమయంలో అతన్ని ఒక ఫ్లాప్ పలకరించింది. దాన్నుంచి బయటపడదామనుకునే లోపే "రావణాసుర" రూపంలో మరొక ఫ్లాప్ అతని నెత్తిన ఒక పిడుగు లాగా పడింది. టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో ఒక గజదొంగ సినిమా కూడా చాలా కష్టపడి చేశాడు. ఆ సినిమా కూడా ఎదురు తన్నింది. ఈగల్ సినిమా అసలు థియేటర్లో ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియని పరిస్థితి.
చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన వాల్తేరు వీరయ్యలో రవితేజ ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు కానీ ఆ మూవీ హిట్ ఇతడికి ఖాతాలో పడలేదు. భారీ అంచనాల మధ్య రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మిస్టర్ బచ్చన్" కూడా పెద్ద డిజాస్టర్ అయి అతని కాన్ఫిడెన్స్ ని బాగా దెబ్బతీసింది. ఇక నెక్ట్స్ ఫిలిం RT 75 కి సైన్ చేశాడు ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అతనికి బాగానే గాయం అయింది. దానివల్ల సర్జరీ కూడా చేయించుకోవలసి వచ్చింది. ఇప్పుడు పోస్ట్ సర్జరీ రికవరీ లో ఉన్నాడు రవితేజ. ఈ సమయంలో డాక్టర్లు అతన్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ ఆయన మాత్రం అసలు వినట్లేదట. రెస్ట్ లేదు పాడు లేదు, సినిమాల స్క్రిప్టులు వింటానని ఒకటే గొడవ చేస్తున్నాడట. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఒక పిచ్చి రవితేజ అని పట్టుకుందట. అందుకే ఆయన బెడ్ మీద ఉండి కూడా సినిమా కథలు వింటున్నట్లుగా సినిమా సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి రవన్న ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
లేటెస్ట్ టాక్ ప్రకారం కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సీ ఓ స్టోరీ వినిపించగా.. రవితేజ ఇంప్రెస్ అయ్యాడట. ఒకవేళ ఆ స్టోరీ తో సినిమా తీయాలని అనుకుంటే దానికి కమిట్ అయ్యే అవకాశం ఉంది. రజినీకాంత్‌తో అరుణాచలం లాంటి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ తీశాడు సుందర్ సీ. కానీ ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ సాధించలేదు. అసలే వరుస ఫెయిల్యూర్స్‌తో రవితేజ బాగా డిస్టర్బ్ అయ్యాడు. అలాంటప్పుడు ఈ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీయడం ఎందుకు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.