దేవర సినిమా విడుదలై 10 రోజులు అవుతూ ఉన్న మొదటి రోజు రూ .172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తాజాగా రూ .466 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చిత్ర బృందం ఒక అదిరిపోయే పోస్టర్ని సైతం ప్రకటించి తెలియజేశారు. రానున్న దసరా పండుగకు కూడా దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హవా చూపిస్తుందని చెప్పవచ్చు. అటు పండుగ నాటికి ఖచ్చితంగా దేవరాజు సినిమా 500 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టడం ఖాయమని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.
దసరా పండుగ కావడం చేత అటు అందరికీ సెలవులు వస్తాయి. దీంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం మరింత ఉన్నది. దసరా పండుగ దేవర మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.. దేవర చిత్రం రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. ఇటీవల సక్సెస్ మీట్ లో కూడా దేవర రెండవ భాగానికి సంబంధించి కొంతమేరకు షూటింగ్ పూర్తి చేశామని కొరటాల శివ బిజీగా ఉండడం చేత కాస్త ఆలస్యంగా ఈ సినిమా రెండవ భాగాన్ని మొదలు పెట్టబోతున్నామంటూ ఎన్టీఆర్ తెలియజేశారు. ప్రస్తుతం పదవరోజు కలెక్షన్ కి సంబంధించి ఫోటోని సైతం చిత్ర బృందం విడుదల చేయగా అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.