తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కంగువా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంగువా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ హాజరయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కంగువా ఈవెంట్ కు ప్రభాస్ హాజరైతే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సాధారణంగా ఇతర హీరోల సినిమాల ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. కంగువా సినిమా ఈ నెల 10వ తేదీనే రిలీజ్ కావల్సి ఉన్నా వేట్టయాన్ సినిమాతో పోటీ ఎందుకని భావించి ఆ సినిమాను వాయిదా వేయడం జరిగింది. అయితే నవంబర్ నెల పెద్ద సినిమాలకు ఏ మాత్రం అనుకూలమైన నెల కాదు. అందువల్ల ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
కంగువా సినిమాపై సూర్య మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద యునానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవాల్సి ఉంది. సూర్యకు ఈ సినిమాతో పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. కంగువా తెలుగు రాష్ట్రాల హక్కుల గురించి పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.