రాఘవేంద్ర అలాగే ఈశ్వర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రభాస్... టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద హీరోగా ఎదిగారు. అలాగే పాన్ ఇండియా స్టార్ గా కూడా కొనసాగుతున్నారు హీరో ప్రభాస్. అయితే ప్రభాస్ ఏజ్ పైబడినప్పటికీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కెరీర్ లో ఎంతో సక్సెస్ అయినా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా.. డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లిపై ఎక్కడ ఊసు ఎత్తడం లేదు.
అప్పట్లో అనుష్క ను పెళ్లి చేసుకోబోతున్నారని ప్రభాస్ గురించి వార్తలు పుంకాను పుంకానుగా వచ్చాయి. అయితే తాజాగా హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కీలక ప్రకటన చేశారు. శ్యామల దేవి... కృష్ణంరాజు సతీమణి అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాగోగులు మొత్తం ఇప్పుడు శ్యామలాదేవి గారే చూసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడి.. హాట్ టాపిక్ అయ్యారు శ్యామలాదేవి.
అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేయబోతున్నట్లు శ్యామలాదేవి ప్రకటించడం జరిగింది. ఇంద్రకీలాద్రిని తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా.. మీడియాతో కాసేపు ముచ్చటించారు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి. అమ్మవారి ఆశీస్సులు అలాగే కృష్ణం రాజు గారి ఆశీస్సులు ప్రభాస్ పైన కచ్చితంగా ఉంటాయని ఆమె తెలిపింది. త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుందని ఆమె వివరించారు. మీరందరూ చూస్తారు... ప్రభాస్ పెళ్లెప్పుడు కచ్చితంగా మీడియాను కూడా ఆహ్వానిస్తామని ఆమె ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.