బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలోనే రాజ్యసభ సినిమా థియేటర్ రైట్స్ కి ముందుగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ బ్యానర్ వారు నైజాం రైట్స్ ను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య 70MM ను రాజా సాబ్ సినిమాను రిలీజ్ చేసే విధంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇదంతా కూడా కల్కి సినిమా భారీ విజయం అవడంతో రాజా సాబ్ సినిమాకి బాగా కలిసి వస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉండడం చేత మైత్రి మూవీస్ వారు ఈ సినిమాని నైజాం రైట్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని జరుగుతోంది. ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రని నిర్మిస్తూ ఉన్నారు.