కొరటాల శివ దర్శకుడుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'దేవర' సినిమా హిట్ అయింది. ఫుల్ మూవీ పెట్టిన బడ్జెట్ కంటే 70 కోట్లు ఎక్కువగా వసూలు చేసి ఎలాగోలా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అంతకు ముందు ఆయన చేసిన 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అయింది, 'దేవర' సినిమా హిట్ అవ్వడం వల్ల ఆయన చాలా రిలీఫ్ పొందారు. 'దేవర' పార్ట్ 1 భారీ హిట్ అందుకొని ఆ జోష్ లో ఉన్న కొరటాల శివ పార్ట్ 2 "బిగ్గర్ బ్లడియర్"గా ఉంటుందని బాగా ఎలివేట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా చూసిన వారు మాత్రం సెకండ్ పార్ట్ చూడ్డానికి ఇంకా ఏముంది ఫస్ట్ పార్ట్ లోనే అంతా అయిపోయింది కదా.

బాహుబలి లో లాగా ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసి తర్వాతే ఏదో ఒక కథ రాసి దానిని తమ మీద రుద్దుదామని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కొరటాల శివ 'దేవర' సినిమా రెండవ భాగం గురించి మాట్లాడుతూ, "మొదటి భాగంలో ఎన్టీఆర్‌ ను 10% మాత్రమే చూపించాం, రెండవ భాగంలో 100% చూపిస్తాం. ఆయన పాత్రలో చాలా మలుపులు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి" అని చెప్పారు.

దేవర సినిమా చివర భాగంలో సైఫ్ అలీ ఖాన్ కనిపించడం తక్కువగా ఉండటం, క్లైమాక్స్ ఎలా ఉంటుందనే దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ బాహుబలి సినిమా క్లైమాక్స్ లాగానే ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ, దర్శకుడు చెప్పినట్లుగా రెండవ భాగం ఖచ్చితంగా అనుకోని విధంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

కొరటాల శివ 'దేవర' సినిమా రెండవ భాగం గురించి చాలా బాగా మాట్లాడారు. దీంతో అభిమానులు 'దేవర 2' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా, 'దేవర' సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కూడా రెండవ భాగం గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: