వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు తాజాగా హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రీతు వర్మ , మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే గతంలో శ్రీ విష్ణు , హసిత్ గోలి కాంబోలో రూపొందిన రాజ రాజ చోరా మూవీ మంచి విజయం సాధించడంతో స్వాగ్ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీసర్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం. మూడు రోజుల్లో ఈ మూవీ.కి నైజాం ఏరియాలో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 80 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.81 కోట్ల షేర్ ... 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ ల్లి కలుపుకొని మూడు రోజుల్లో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.82 కోట్ల షేర్ ... 6.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపుగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఈ మూవీ మరో 4.68 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv