చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అనేక మల్టీస్టారర్ మూవీలు వచ్చేవి. ఎంతో మంది స్టార్ హీరోలు కలిసి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు మల్టీ స్టారర్ మూవీలలో నటించలేదు. అలా ఎన్నో సంవత్సరాల పాటు మల్టీ స్టారర్ మూవీలే తెలుగులో రాలేదు. అలాంటి సమయం లోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి వెంకటేష్ , మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు.

మూవీ కూడా మంచి విజయం సాధించడంతో మళ్లీ మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ తెలుగు సినీ పరిశ్రమలో మొదలు అయింది. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ , మహేష్ బాబు కాంబోలో భారీ మల్టీస్టారర్ మూవీ రూపొందాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. మరి ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది ..? వీరిద్దరితో మల్టీస్టారర్ మూవీ తీయాలి అనుకున్న దర్శకుడు ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కే ఎస్ రవి కుమార్ ఒకరు.

ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ , మహేష్ బాబు హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీలు చేయాలి అనుకున్నాడట. ఆల్మోస్ట్ ఇద్దరు హీరోలకు కథలను చెప్పి ఓకే కూడా చేయించుకున్నాడట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనుకోని కారణాల వల్ల ఈ మల్టీ స్టారర్ మూవీ ఆగిపోయిందట. ఇకపోతే కే ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ హీరోగా జై సింహా , రూలర్ అనే రెండు మూవీలను రూపొందించాడు. ఇందులో జై సింహ మూవీ మంచి విజయం సాధించగా , రూలర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: