సూపర్ స్టార్ రజినీకాంత్ సౌత్ ఇండియన్ సినిమా కే కాకుండా ఇండియన్ సినిమాకే బాద్‌షా.. ఆయన గురించి మనం మాట్లాడటం కాదు బాక్సాఫీస్ లెక్కలు మాట్లాడతాయి. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ రోజు రజిని అభిమానులకు పెద్ద పండగ .. అంతే కాకుండా తమిళనాడు లోని చాలా కంపెనీలు రజిని సినిమా రిలీజ్ అవుతుంటే హాలిడే కూడా ప్రకటిస్తాయి . మరికొన్ని అయితే ఏకంగా ఉద్యోగులకు టికెట్లు కూడా బుక్ చేసి సినిమా చూడమని ఆఫర్లు కూడా ఇస్తుంటాయి . ఇలాంటిది ఒక రజినీకాంత్ విషయం లోనే జరుగుతాయి .

ఏడుపదుల వయసు దాటినా కూడా సినిమాకు రెండు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాంటి రజినీకాంత్ తో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు కలిసి నటించారు . అలాంటిది రజనీకాంత్ కు అమ్మగా , లవర్ గా , భార్య గా ఓ హీరోయిన్ నటించింది .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు .. అనేది ఇక్కడ చూద్దాం . ఆ హీరోయిన్ మరెవరే కాదు అతిలోకసుందరి శ్రీదేవి .. అవును ఇది నిజం శ్రీదేవి రజనీకాంత్ కు ఒక సినిమా లో అమ్మగా కూడా నటించింది .


అది కూడా కేవలం ఆమె 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు .. రజనీకాంత్ కు తల్లిగా నటించింది. 1976 లో వచ్చిన  'మూండ్రు ముదిచు'  సినిమాలో రజనీకాంత్ కు తల్లిగా నటించింది . అంతే కాదు శ్రీదేవి కి అదే తొలి సినిమా కూడా.. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో 22 సినిమాలు కు పైగా వచ్చాయి అందులో ఎన్నో సినిమాల్లో ఆమె భార్యాగా , లవర్ గా , కూడా నటించింది . అలా రజినీకాంత్ కు అమ్మగా భార్యా గా లవర్ గా నటించిన్న‌ ఏకైక హీరోయిన్ గా శ్రీదేవి నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: