ఇండియాలో ప్రతి సంవత్సరం వందల నుంచి వేల సంఖ్యలో సినిమాలు వివిధ భాషలలో రిలీజ్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సినిమా కంటెంట్ బాగుంటే చాలు బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా రియలిస్టిక్ కథ, కథనాలతో… రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే సంఘటనతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి విజయం వైపు దూసుకపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో వివిధ భాషలలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచిన సినిమాల జాబితా లో ‘కల్కి 2898ఏడీ’ సినిమా ఉంది. ఈ సినిమా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చిన ఈ సినిమా నిర్మాణ వ్యయం చుస్తే 600 కోట్ల పైనే ఉంది. అందుకే పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల మూవీకి వచ్చిన లాభాలు తక్కువగా ఉండడం అందరిని నిరాశలో నిలిపింది.

ఈ తరుణంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ‘స్త్రీ 2’ మూవీ ఈ సంవత్సరం సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా చోటు సొంతం చేసుకుంది. ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 700 కోట్లకి పైగా కలెక్షన్స్ లాంగ్ రన్ లో వచ్చాయి అని సమాచారం. అలాగే అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాలలో ‘స్త్రీ 2’ ఒకటి అని తెలుస్తోంది. ఈ లిస్టులో మలయాళంలో రియల్ సంఘటనలు లీడ్స్ గా తీసుకోని  తెరకెక్కిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ 20 కోట్ల బడ్జెట్ తో వస్తే ఏకంగా 242 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళ్లు రాబట్టింది.

యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు ‘ప్రేమలు’ సినిమాని విపరీతంగా అక్కటుకుంది. మన తెలుగులో కూడా ‘ప్రేమలు’ మూవీకి అద్భుతమైన టాక్ వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఏకంగా 136 కోట్ల కలెక్షన్స్ ని వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కంటే భారీగా అంటే దాదాపు 4500 శాతం కలెక్షన్స్ వచ్చాయని సినిమా యూనిట్ వారు తెలిపారు. అయితే ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో ప్రేమలు సినిమా నెంబర్ వన్ లో ప్లేస్ లో ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: