నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు . కొంత కాలం క్రితం అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్యసినిమా తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఆ తర్వాత వీర సింహా రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత భగవంత్ కేసరి  మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే వరుస విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం , వాల్టేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం ఈ మూవీ నుండి పెద్దగా ఎలాంటి అప్డేట్లను విడుదల చేయడం లేదు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతున్న ఈ మూవీ టైటిల్ ను గాని , ఈ సినిమా విడుదల తేదీని కానీ మేకర్స్ ప్రకటించలేదు. దానితో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే దానిపై ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. దానితో సినిమాపై అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ఉన్నా కానీ సరిగ్గా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేయకపోవడంతో బాలయ్య అభిమానులు ఈ మూవీ యూనిట్ పై కాస్త గరం అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk