ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అక్కినేని నాగార్జున... వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కొండా సురేఖ పైన 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు అక్కినేని నాగార్జున. కచ్చితంగా రోడ్డుకు ఈడ్చే వరకు తాను ఊరుకోనని.. భీష్మించుకుని కూర్చున్నారు అక్కినేని నాగార్జున. అయితే అక్కినేని నాగార్జున వైపు న్యాయం ఉంది. అందుకే ఆయన వెనక్కి తగ్గడం లేదు.
కానీ ఈ విషయంలో... అక్కినేని నాగార్జున ను దోషి చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలాన్ని కబ్జా చేసి.. అక్రమ నిర్మాణాలు అక్కినేని నాగార్జున చేశారని ఓ అజ్ఞాత వ్యక్తి కేసు వేశారు. దీనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడబోమని చెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ తరపు న్యాయవాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని నాగార్జున ను కోర్టుకు ఈడ్చుతామని... మహిళా మంత్రి కొండా సురేఖ పై అన్యాయంగా కేసు వేశాడని ఆయన మండిపడ్డారు. అలాగే.. అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న బిగ్ బాస్ సోలో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని కూడా లాయర్ ఆరోపణలు చేశారు. మహిళలు అలాగే అబ్బాయిలు ఇద్దరు కలిసి పడుకోవడం దారుణంగా ఉందని... వాడిని మనకు చూపిస్తున్నారని కూడా నాగార్జున పై ఫైరయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులపాటు అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఒకరి పైన ఒకరు పడుకుంటారని కూడా ఆయన బాంబు పేల్చారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.