అయితే అదృష్టం ఆమెను కాదు అని వెనక్కి వెళ్ళిపోయింది . నిజానికి దేవర సినిమాపై చాలా చాలా నెగటివ్ టాక్ వినిపించింది. ఆ దేవుడి పుణ్యమో లేక నిజంగానే కలెక్షన్స్ బాగా కుమ్మేసాయో తెలియదు కానీ.. పైకి మాత్రం సినిమా బీభత్సమైన రికార్డ్స్ క్రియేట్ చేసిందనే వార్తలు మనం ఎక్కువగా వింటూ వస్తున్నాం . అయితే ఎన్టీఆర్ ఓ స్టార్ హీరో సినిమా హిట్ అయిన ..ఫట్టైనా ఆయన రేంజ్ మాత్రం ..ఏ ఏ మాత్రం మారదు .కానీ ఎన్టీఆర్ దేవర సినిమా పైన బోలెడు ఆశలు పెట్టుకొని రాత్రి పగలు కష్టపడ్డ జాన్వి కెరియర్ మాత్రం ఫ్లాప్ అయిందని చెప్పాలి.
దేవర సినిమా టాక్ అసలుకే బాగాలేదు ..అందులో హీరోయిన్ గా కనిపించిన జాన్వి కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది అని.. అసలు యాక్టింగ్ బాగోలేదు అని ..ఒక్క "చుట్టూ మల్లే" సాంగ్ తప్పిస్తే ఆమెకు ఇక సినిమాలో పెద్ద స్కోప్ లేదు అన్న కామెంట్స్ కూడా విన్నాము. అయితే ఇప్పుడు దేవర టాక్ ఆమెకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టేలా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మొదటి నుంచి జాన్వికపూర్ అంటే హాట్ యాంగిల్ లోనే చూడడం జనాలకు అలవాటైపోయింది .
ఆఫ్ కోర్స్ జాన్వి కూడా అలాగే అందాలు ఆరబోసేది . ఏదో దేవర పుణ్యమా అంటూ చీరలో మెరిసిందే తప్పిస్తే బయట మనం పద్ధతిగా జాన్విని చూసేది చాలా తక్కువ . అయితే దేవర సినిమాలో ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది..పైగా న్యాచురల్ లంగా వోణీ లుక్స్ ఆమెకు సెట్ కాలేద్య్.. ఆమె పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదు అన్న కామెంట్స్ చూసిన తెలుగు డైరెక్టర్స్ జాన్వికి సెకండ్ హీరోయిన్ ఛాన్సెస్ ని ఎక్కువగా ఇస్తున్నారట .
దేవర సినిమా తర్వాత కమిట్ అయిన ఒక తెలుగు సినిమాకి సైతం జాన్విను మొదటగా ఫస్ట్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . దేవర టాక్ తర్వాత మొత్తం తలకిందులు అయిపోయింది. ఇప్పుడు ఆమెను సెకండ్ హీరోయిన్ గా చేస్తూ డైరెక్టర్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. దీంతో జాన్వీ కమిట్ అయిన సినిమా నుంచి తప్పుకోలేక ..తప్పుకుంటే ఇక అవకాశాలు వస్తాయో..? రావో..?అన్న భయంతో అల్లాడిపోతుందట . ఒక స్టార్ హీరోయిన్ కూతురుకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దారుణమే . చూద్దాం మరి ఈ కష్టం నుంచి జాను ఎలా బయటపడుతుందో..??