అయితే ఈ విషయంపై సినిమా పరిశ్రమ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. ఇక సోషల్ మీడియా వేదికగా అటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై స్పందించారు అని చెప్పాలి. అయితే ఈ వివాదం తర్వాత మొట్టమొదటిసారి అటు సమంత హైదరాబాద్ రాబోతున్నారు. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక తొలిసారి ఈ వివాదం తర్వాత సమంత సోషల్ మీడియాని ఫేస్ చేయబోతున్నారు అని చెప్పాలి.
ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు సమంత. అయితే ఈ సినిమా ఈవెంట్ సమంతది కాదు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన జిగ్రా అనే సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఆలియా భట్ హైదరాబాద్ రాబోతుంది. ఇక ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్, సమంత, రాణా లాంటి వారికి ఆహ్వానం అందింది. ఇక సొంత సినిమా కాకపోయినప్పటికీ సమంత ప్రెస్ మీట్ కి హాజరు కాబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే సమంత ప్రెస్ మీట్ లో పాల్గొంటే మాత్రం తప్పకుండా జర్నలిస్టులు అటు కొండ సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ప్రశ్నలు సంధించే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. మరి సమంత వీటిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.