ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ , టీజర్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే ఈ సినిమా నుంచి మేకర్లు వరుస అప్డేట్లు కూడా ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ బిజినెస్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా వచ్చిన ఎన్టీఆర్ దేవర యుఎస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. కేవలం ఓవర్సీస్ మార్కెట్ లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ దేవర కలెక్షన్లను టార్గెట్‌గా గేమ్ ఛేంజర్ తో వస్తున్నాడు. ఇక యూఎస్ మార్కెట్ లో గేమ్ ఛేంజర్ 4.5 మిలియన్ డాలర్స్ ను టార్గెట్ గా చేసుకుని రణరంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇది సోలో హీరోగా చరణ్ కెరీర్ లోన్ హైయెస్ట్ బిజినెస్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమానికి థమన్ సంగీతం అందిచగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అయితే ఇప్పుడు మూవీ రీలీజ్ విషయంలో కూడా అనుమలు వస్తున్నయి. గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ కానుందని టాక్ కూడా వినిపిస్తోంది. డిసెంబర్ లో పుష్ప2 వస్తోంది. ఆ తర్వాత డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే మిగిలిన వాటికి నష్టమొచ్చే ఛాన్సుందని వచ్చే ఏడాది ఆరంభంలో మంచి రిలీజ్ డేట్ చూసుకుని గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని కూడా అంటున్నారు.