పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు ఏపీ ప్రభుత్వ పనులతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు అతని కూతుళ్లు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్.. ఇలా పలువురు ప్రముఖులు వెళ్లారు. తిరుమల నుంచి వీరి ఫోటోలు, వీడియోలు వచ్చి వైరల్ అయ్యాయి.  ఇదిలా ఉంటే తెలుగు సినిమా దగ్గర అపారమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి ఎంత మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ సినిమా వస్తుంది అంటే అది టాక్ తో సంబంధం

 లేకుండా డే 1 బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది. కాగా దర్శకుడు ఎవరో కూడా తెలియని సినిమాలు చేస్తూ వచ్చిన పవన్ అలాంటి సినిమాలతో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించగలిగే సత్తా ఉన్నవాడు అని ఎవరో అన్న మాట కాదు తెలుగు సినిమా దగ్గర ఎన్నో సినిమాలు నిర్మాణం వహించి డిస్ట్రిబ్యూషన్ అందించిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్ బాబు అన్న మాట ఇది. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాలు సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో బ్రేక్ ఇచ్చిన పవన్.. తొందరలోనే సెట్స్‌లో పాల్గొని ఆ సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాను.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో వదులుకున్నాడని.. అతను చేయాల్సిన సినిమానే.. పవన్ కు అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటించాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ మూవీ మరేదో కాదు జల్సా. జల్సా సినిమాను మొదట మహేష్ బాబు చేయాలని త్రివిక్రమ్ భావించారట. కానీ.. మహేష్ బాబు అప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉండడంతో.. సినిమాను రిజెక్ట్ చేశాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాను పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: