అక్కినేని నాగేశ్వరరావు తో సినిమా అంటే అప్పట్లో ఎంతో మంది హీరోయిన్లు ఇష్టపడేవారట. ముఖ్యంగా ఈ జనరేషన్ లో నాగార్జున ఎలా అయితే అమ్మాయిల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారో అచ్చం అలాగే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు కూడా అమ్మాయిల్లో అలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయనతో సినిమాలు చేయాలని ఎంతో మంది హీరోయిన్లు ఎగబడే వారట. ముఖ్యంగా తన సినిమాలో ఒక చిన్నపాత్ర చేసే అవకాశం వచ్చినా కూడా చాలా ఇష్టంగా భావించే వారట.అయితే అలాంటి ఎంతో గొప్ప నటుడు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావుని ఓ హీరోయిన్ మాత్రం చాలా సింపుల్ గా తీసుకొని ముసలోడితో డ్యాన్స్ ఏంటి అంటూ చాలా అవమానంగా మాట్లాడిందట.. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏఎన్ఆర్ ని ముసలోడితో ఎందుకు పోల్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. 

ఇప్పటి జనరేషన్లో ఒక హీరో ఒక హీరోయిన్ తో సినిమా చేస్తేనే మరీ ఎక్కువ అనుకుంటారు. కానీ అప్పటి జనరేషన్ లో మాత్రం ఒకే హీరో హీరోయిన్ కాంబినేషన్లో పదుల కొద్ది సినిమాలు వచ్చేవి. ఇక ఇప్పటిలో అయితే ఒకటి రెండు సినిమాలు చేస్తేనే వారిద్దరి మధ్య ఎదో ఉందనే గాసిప్ లు వినిపిస్తూ ఉంటాయి. అయితే అప్పట్లో హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఒకే హీరోయిన్ ని పెట్టుకొని పది పదిహేను సినిమాలు తీసేవారు.కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ల సంఖ్య పెరిగిపోయింది.. ఈ విషయం పక్కన పెడితే అప్పట్లో ఏఎన్ఆర్ కి చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏఎన్ఆర్ ని చాలా దారుణంగా అవమానించింది.

ఇక ఆమె ఎవరో కాదు శ్రీదేవి.. శ్రీదేవి మనవరాలి పాత్రలో నటించిన హీరో తోనే హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ప్రేమాభిషేకం సినిమాలో మొదటిసారి ఏఎన్ఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రీదేవి. అయితే అప్పటికే 60 ఏళ్లు ఉన్న ఏఎన్ఆర్ ను చూసిన శ్రీదేవి సినిమా షూటింగ్ లో ఏఎన్ఆర్ తో డ్యాన్స్ అనేసరికి 60 ఏళ్ల ఏఎన్ఆర్ తో డాన్స్ ఏంటి అంటూ వేరే వాళ్లకు చెప్పుకొని నవ్వేసారట.అయితే ఈ విషయం షూటింగ్ స్పాట్ లో ఉన్న కొంతమంది ద్వారా తెలుసుకున్న ఏఎన్ఆర్ ఆహా నేను 60 ఏళ్ల వ్యక్తినా..నా సత్తా ఏంటో చూపిస్తాను.. శ్రీదేవి తోనే కాదు శ్రీదేవి మనవరాలితో కూడా డాన్స్ చేసే సత్తా నాలో ఉంది అని చెప్పి ఆ పాటలో ఏఎన్ఆర్ శ్రీదేవిని మించి ఎనర్జీతో డ్యాన్స్ చేశారట. ఇక ఏఎన్ఆర్ ఎనర్జీ ని చూసి శ్రీదేవి సైతం అవ్వక్కయిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: