బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం చేస్తూ ఉండగా.. నాగార్జున బిగ్ బాస్ అనే కార్యక్రమం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు రానా నెంబర్ వన్ యారి అనే కార్యక్రమం నిర్వహించారు. అయితే అటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా సల్మాన్ ఖాన్ అటు బాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటాడు అన్నది తెలుస్తోంది.
అలాంటి సల్మాన్ ఖాన్ ఇక హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నందుకుగాను సల్మాన్ ఖాన్ దాదాపు నెలకు 60 కోట్ల రూపాయలు తీసుకుంటాడట. అంటే బిగ్ బాస్ సీజన్ పూర్తయ్యలోపు 250 కోట్ల రూపాయలు అటు సల్మాన్ అకౌంట్లో చేరిపోతాయట. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బిగ్బాస్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయవచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన తొలినాళ్లల్లో మాత్రం 10 కోట్లు మాత్రమే తీసుకునేవారట.