అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చిన తర్వాత కొంతమంది అమ్మాయిలు తమ ఇష్టాలను తుంచేసుకుని ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ విషయం మనకు తెలిసిందే. కొంతమంది తమకు ఇష్టమైన పనులను కచ్చితంగా చేస్తూ ..ఇష్టం లేని వాటిని దూరంగా పెడుతూ ఉంటారు . అయితే ఆ కాలంలో - ఈ కాలంలో ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇష్టం లేకపోయినా సరే ఒక పని మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఆ పని ఏంటో తెలుసా..?
"డైటింగ్".. ఎస్..ప్రతి హీరోయిన్ ఇష్టం లేకపోయిన చేసేది ఆ డైటింగే. కడుపు నిండా అన్నం తినాలి అని ఎవరికీ ఉండదు చెప్పండి..? అందరికీ ఇష్ట ఇష్టాలు ఉంటాయి. ఫుడ్ లవర్స్ అందరూ ఉంటారు . అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్స్ మాత్రం చాలా మంది ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉంటారు . అలనాటి నటి సావిత్రి గారి దగ్గర నుంచి నిన్న గాక మొన్న ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వరకు అందరూ కూడా ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూనే ఉంటారు.
డైనింగ్ టేబుల్ నిండా అన్ని ఐటమ్స్ ఉన్న డైటింగ్ అంటూ తమ కడుపుని మాడ్చుకుంటూ ఉంటారు . అఫ్కోర్స్ అందంగా కనిపించాలి అంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే..తప్పదు.. కడుపు మాడ్చుకొని డైటింగ్ చేసి ..జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ తంతు ఇంకా ఎంతకాలం ఉంటుందో..? హీరోయిన్స్ ఎంత కాలం కడుపు మాడ్చుకోవాల్సి వస్తుందో..? ఆ దేవుడికే తెలియాలి..!!