సాయి పల్లవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? చెప్పండి . ఒకటా.. రెండా.. ఎన్నో సినిమాలో నటించింది.  ప్రతి సినిమాలోనూ తన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ని చూపించింది . మరీ ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసి తమ పేరుకి పాపులారిటీ సంపాదించుకునేలా చేసుకున్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ పలు అడ్డుదారులు తొక్కుతూ తమకు తగిన రీతిలో తమ పేరుని అందరికి తెలిసేలా  చేసుకున్నారు .


అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం కేవలం టాలెంట్ తోనే.. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా దక్కించుకునేలా చేసుకుంది. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ లోను జెట్ స్పీడ్ లో దూసుకుపోయే రేంజ్ లో సినిమా అవకాశాలు అందుకుంటుంది . కాగా రీసెంట్గా చెల్లెలు పెళ్లిలో సందడి చేసిన సాయి పల్లవి కి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా ట్రెడిషీనల్ బట్టల్లో మెరిసి ఆమె పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచేసుకుంది.



కాగా రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. అన్నిట్లోనూ చాలా చాలా టాలెంటెడ్ అయిన సాయి పల్లవి ఒక విషయంలో మాత్రం దమ్మిడికి కూడా పనికిరాదు అంటూ పలువురు ఆమె ను ట్రోల్ చేస్తున్నారు . డ్యాన్స్.. యాక్టింగ్ లో సూపర్ టాలెంటెడ్ గల సాయి పల్లవి రొమాన్స్ విషయంలో మాత్రం అస్సలు సెట్ అవ్వదని ..రొమాంటిక్ సీన్స్ కి.. రొమాంటిక్ యాంగిల్ లో డాన్స్ చేయడానికి సాయి పల్లవి అసలు సూట్ కాదు అని పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు .



అంతేకాదు ఎలాంటి డాన్స్ అయినా సరే అవలీలగా చేసే సాయి పల్లవి ఇప్పటివరకు ఒక రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారు . మా హీరోయిన్ టాలెంట్ తోనే పైకి వచ్చింది ..ఒళ్ళు చూపించుకునేలా డ్రస్సులు వేసుకొని కాదు ..మరీ ముఖ్యంగా అందరికీ నచ్చేలా యాక్టింగ్ చేయడం సాయి పల్లవి స్పెషాలిటీ అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: