గ్లోబల్ వైడ్ గా ఫుల్ పాపులర్ అయిన తెలుగు స్టార్ హీరోలలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకరు.. ఎన్టీఆర్ కి అపారమైన టాలెంట్ ఉంది ఇది ఎవరూ కాదనలేని సత్యం.   rrr సినిమాతో  ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది.దీనితో ఈ క్రేజ్ ని ఎలాగైనా కాపాడుకోవాలని ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు. అలానే ఎప్పటి నుంచో ఆలస్యం అవుతూ వస్తున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై బాగా ఒత్తిడి తెచ్చాడు అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రశాంత్ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా ఓకే చేసారు కానీ అది కాస్తా అలా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇదిలావుండగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ మంచి గుర్తింపు సాధించుకున్నాడు . మామూలుగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అలానే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా వచ్చిన కే జి ఎఫ్ 2 కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇక అప్పటినుంచి ప్రశాంత్ నీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది . అక్కడితో ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను చేశాడు ప్రశాంత్. ప్రభాస్ కెరియర్ కి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కం బ్యాక్ అయింది. సినిమా ఫస్ట్ షో పడగానే పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ఎప్పుడో అనౌన్స్ చేశారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు తెలిసిన విషయమే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఫ్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ లేదు అని తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా సాగిపోయే సింగిల్ సినిమా అని సమాచారం వినిపిస్తుంది. త్వరలో  దీని గురించి అధికార ప్రకటన రానుంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కూడా తర్వాత పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ వసూలు చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: