ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోతుంది . టాప్ సెలబ్రిటీలపై నిందలు వేయడం.. తద్వారా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకోవడం ..ఇలాంటి నిందలు ఏ యూట్యూబరో.. సెలబ్రిటీ కావడానికి తాపత్రయపడే సామాన్య జనాలో చేస్తే చూసి చూడనట్లు వదిలేయొచ్చు. పెద్ద టాప్ స్థానంలో ఉండి గౌరవమైన పొజిషన్లో ఉండే ఒక మంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా సంచలన ఆరోపణలు చేస్తే.. అది నిజంగా ఒక సెన్సేషన్ అవుతుంది .


ప్రెసెంట్ అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరో నాగచైతన్య.. హీరోయిన్  సమంతల విడాకుల మేటర్ లో వేలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. నాగచైతన్య సమంతల విడాకులకు మెయిన్ కారణం కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాదు నాగార్జున ఎన్  కన్వెన్షన్ హాల్ ని కూల్చకుండా ఉండాలి అంటే .. అక్కినేని ఇంటి కోడలుగా ఉన్న సమంతను తన వద్దకు పంపాలి అంటూ కేటీఆర్ కోరారు అని.. దానికి నాగార్జున కూడా ఒప్పుకొని సమంతను కేటీఆర్ వద్దకు పంపించడానికి బాగా ట్రై చేశాడు అని ..పద్ధతిగల సమంత అందుకు నిరాకరించడంతోనే.. నాగచైతన్యకి విడాకులు ఇచ్చేసి బయటికి తరిమేశారు అని ..చాలా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది.



దీనిపై ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీరియస్ అయింది . ఎటువంటి ఆధారాలు లేకుండా అలా తప్పుడు నిందలు ఎలా వేస్తారు మేడం గారు అంటూ మంత్రిని నిలదీస్తున్నారు. ఇప్పటికే చాలామంది టాప్ సెలబ్రిటీస్ మంత్రి కొండా సురేఖ కి ట్విట్ చేశారు . అఫ్ కోర్స్ కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసింది . అయితే ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే .. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ పై ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా నిందలు వేయకుండా ఉండాలి అంటే.. కొత్త రూల్ తీసుకురావాలి అని సినీ హీరోలు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారట .



ఇకనుంచి ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లపై  తప్పుడు మాటలు మాట్లాడితే.. మరీ ముఖ్యంగా పొలిటికల్ పరంగా ఉండే వాళ్ళు స్టార్ హీరోయిన్స్ హీరోలపై తప్పుడు నిందలు వేసిన ఇక తాట తీసే రేంజ్ లో కొత్త రోల్ తీసుకురాబోతున్నారట , మొత్తానికి కొండా సురేఖ నోటి దూల కొత్త రూల్ ని తీసుకొచ్చేలా చేసేసింది . చూద్దాం ఫిలిం చాంబర్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..? ఆ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ ఏ మేరకు బాగుపడుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: