ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సమంత - నాగచైతన్య - కేటీఆర్ - కొండా సురేఖల పేర్లే మారుమ్రోగిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడు సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయే మంత్రి కొండా సురేఖ ఈసారి అనుకోని ఊహించని మేటర్ లో వేలు పెట్టింది . తెలిసి చేసిందో తెలియక చేసిన తెలియదు కానీ కొండా సురేఖ మాత్రం సరిదిద్దుకోలేని తప్పే చేసింది.  ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసలు అవసరం లేని మ్యాటర్ ని హైలైట్ చేసింది. నాగార్జున కోడలు సమంత నాగార్జున కొడుకు నాగచైతన్య విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది . దానికి సంబంధించిన వార్తలు మనం వింటూనే వస్తున్నాం.


అయితే సమంత - కేటీఆర్ - నాగచైతన్య - కొండా సురేఖ ఇష్యులపై చాలామంది స్టార్ హీరోలు రియాక్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లపై ఇలాంటి నిందలు వేయడం తగదు అని.. ఆధారాలతో మాట్లాడాలి అని పలువురు ఆమెను వార్న్  కూడా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ - నాని- మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ కూడా సమంతకు సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు . అయితే ఇండస్ట్రీలో బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఓ పెద్ద వ్యక్తి మాత్రం అసలు సమంత ఇష్యుపై స్పందించలేదు . అతగాడికి రాజకీయాలతో సంబంధం ఉన్నా సరే ఇంత పెద్ద దారుణాతి దారుణమైన నిందలు వేసిన కూడా ఆ హీరో సైలెంట్ గా ఉండిపోవడం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది .



చీమ చిట్టుకన్న సరే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ హాట్ హాట్ గా కామెంట్స్ చేసే ఆ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో బడా హీరో అయిన నాగార్జున ఫ్యామిలీ పై ఇలాంటి నింద వేసిన సరే సైలెంట్ గా ఉండడం అందరికీ కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అయితే అతగాడు సైలెంట్ గా ఉండిపోవడానికి కారణం సమంతనే అంటూ జనాలు భావిస్తున్నారు.  గతంలో సమంత కారణంగానే అక్కినేని ఫ్యామిలీకి ఆ హీరోకి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అని ..అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు అని.. గతంలో నాగార్జున హీరో ఎంత క్లోజ్ గా ఉన్నా సమంత ..అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ మొత్తం చెల్లాచెదురు అయిపోయింది అని..



ఆ కారణంగానే ఆ హీరో ఇప్పుడు అక్కినేని కుటుంబం పై ఇంత పెద్ద నింద పడ్డా కూడా సైలెంట్ గా ఉన్నాడు అని ..పరోక్షకంగా ఆ హీరో ఈ మేటర్ లో సైలెంట్ గా ఉంటూ సమంత పై పగ తీర్చుకుంటున్నాడు అని జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అయితే చాలామంది సామాన్య జనాలు సైతం కొండా సురేఖను తప్పుపడుతూ ఆమె మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి అని అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అని కోరుకుంటున్నారు. కానీ కొండా సురేఖ మాత్రం కేవలం సమంత కి సారీ చెప్పింది.. అక్కినేని కుటుంబ సభ్యులకి ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం గమనార్హం..!


మరింత సమాచారం తెలుసుకోండి: