తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి గోపీచంద్ తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రముఖ నిర్మాత టి జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి దాదాపుగా అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొని ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొని ఉన్న ఈ మూవీ లో హీరో గా నటించిన గోపీచంద్ , హీరోయిన్గా నటించిన కావ్య థాపర్ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. గోపీచంద్ ఆఖరుగా సిటిమార్ అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక కావ్య నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలాగే ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలు వరుస అపజయాలను అందుకుంటున్నాయి.

ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల కూడా వరుస అపాజయలతో పడిపోయి ఉన్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు కూడా చాలా సినిమాలనే నిర్మించగా అందులో అతి తక్కువ సినిమాలు మాత్రమే హిట్లు అయ్యాయి. ఈ మధ్య కాలంలో కూడా వీరు నిర్మించిన సినిమాలు పెద్దగా ఏవి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేదు. ఇలా వరుస ఆపాజయలతో ఉన్న ఈ నలుగురి కాంబోలో రూపొందిన విశ్వం మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: