రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మరింత జోరుని పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్-2, కల్కి-2, స్పిరిట్, డైరెక్టర్ హనురాఘవపూడి  వంటి డైరెక్షన్లో చేయబోతున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ శరవేగంగా ఈ సినిమాని  పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉండగా.. హీరోయిన్స్ గా మాళవిక మోహన్, రిధి, నిధి అగర్వాల్ నటిస్తూ ఉన్నారు.


ఇందులో విలన్ గా కూడా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ ని స్టైలిష్ గా చూపించే గ్లింప్స్ కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. రాజా సాబ్ సినిమా హర్రర్, కామెడీ ,రొమాంటిక్ యాంగిల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ రోజున డైరెక్టర్ మారుతి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజా సాబ్ నుంచి ఒక మేకింగ్ వీడియో ని విడుదల చేశారు.

ఈ వీడియోలో డైరెక్టర్ మారుతీతో ప్రభాస్ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నట్టు చూపించడమే కాకుండా లొకేషన్ కి సంబంధించి పలు రకాల షాట్లు కూడా చూపించారు. అలాగే ఇందులోని నిర్మాతలతో పాటు పలు రకాల సన్నివేశాలను ఎక్స్ప్లైన్ చేసే విధంగా డైరెక్టర్ మారుతి చూపించారు.. అలాగే ఇందులో మరొక డైరెక్టర్ కూడా కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది యాక్టర్లను కూడా చూపించడం జరిగింది. మొత్తానికి ప్రభాస్ తో కలిసి తన డ్రీమ్ ని పూర్తి చేసుకోవడానికి సిద్ధమయ్యారు మారుతి.

మరింత సమాచారం తెలుసుకోండి: