సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జై భీమ్ మూవీకి దర్శకత్వం వహించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , కేరళ , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఈ సినిమాకు 25 కోట్ల ప్రీ బిజినెస్ జరగగా , ఓవర్ సీస్ లో 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి ఉంది. ఈ సినిమా 162 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: