మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. మొదట భీమ్లా నాయక్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బింబిసారా, సార్, విరూపాక్ష అంటే చిత్రాలతో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అయితే ఈమధ్య సినిమా అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ కూడా సరైన కథలతో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది సంయుక్త మీనన్. ప్రస్తుతం ఈమె చేతిలో సుమారుగా నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయట.ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాతో రాని ఈ ముద్దుగుమ్మ వచ్చే యేడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.



ముఖ్యంగా ఇందులో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం కూడా ఉన్నది. అయితే సంయుక్త లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తోందని చాలా మంది ఇమేను విమర్శించడం కూడ జరిగిందట. డైరెక్టర్ రాజేష్ దండా నిర్మాణంలో ఈమె నటిస్తున్నది. అయితే ఈ మధ్యకాలంలో అటు హీరోలు హీరోయిన్స్ కూడా నిర్మాణ భాగస్వామ్యరుగా తమ చిత్రాలకు మారుతూ ఉన్నారు. మరి కొంతమంది స్టార్ హీరోయిన్లు స్వయంగా కొన్ని చిత్రాలకు నిర్మాతగా మారిన సందర్భాలు ఉన్నాయి. నయనతార, సమంత వంటి హీరోయిన్లు కూడా ఇప్పుడు నిర్మాణం బాట పట్టుతున్నారు. ఇప్పుడు వారి బాటనే సంయుక్త కూడా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో సక్సెస్ అయి పేరు నిలబెట్టుకుంటుందేమో చూడాలి.


తన నిర్మాణంలోనే తాను హీరోయిన్గా ఒక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ రాజేష్ దండా నిర్మాణంలో రాబోతున్న చిత్రం మొదట సమంతా వద్దకు వెళ్ళిందట. అయితే ఈ సినిమా కథ సమంత మొదటి ఒకే చెప్పిన కొంత సమయం కావాలని అడగడంతో ఆమె డేట్లు కూడా అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి సంయుక్తా తో ఈ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: