అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా అలేఖ్య రెడ్డి మాత్రం పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే ఒక నెటిజన్ అంతమంది పిల్లల్ని ఎందుకు కన్నారంటూ అలేఖ్య రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె పిల్లలను సైతం బాధ పెట్టేలా ఆ కామెంట్లు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కామెంట్లు చూస్తే ఎవరికైనా కోపం వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తారకరత్న పిల్లలపై ఏకంగా అలాంటి ట్రోల్స్ రావడంతో అలేఖ్య రెడ్డికి కోపం వచ్చినా ఆమె మాత్రం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సున్నితంగా కామెంట్లు చేశారు. పిల్లల విషయంలో ప్రేమగా వ్యవహరించాలని ద్వేషం, నెగిటివిటీతో కూడిన కామెంట్లతో పిల్లలను పెంచకూడదని ఆమె పేర్కొన్నారు. పిల్లలను సమానంగా చూడాలని వాళ్లలో ద్వేషాన్ని నింపడం సరికాదని ఆమె చెప్పుకొచ్చారు.
పిల్లలకు ప్రేమను పంచాలంటూ అలేఖ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అలేఖ్య కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ తమ వంతు సహాయం అందిస్తోంది. అలేఖ్య రెడ్డికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అలేఖ్య రెడ్డి తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. అలేఖ్య రెడ్డి తన పిల్లలను ఉన్నత స్థానాలలో నిలబెట్టాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారకరత్న భౌతికంగా మరణించినా పిల్లలపై ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలేఖ్య రెడ్డి గురించి అంత దారుణంగా ట్రోల్స్ చేసేవాళ్లు మనుషులేనా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.