జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఒక సెన్సేషనల్ గా మారిపోయింది.. ఎప్పుడూ కూడా రొటీన్ కథలకు భిన్నంగా సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ భారీగానే కలెక్షన్స్ రాబడుతున్నారు ఎన్టీఆర్. అందుకు నిదర్శనం తాజాగా రిలీజ్ అయిన దేవర సినిమానే అని చెప్పవచ్చు. దేవర సినిమా విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో జరిగిన నెగెటివిటీ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు.. ఇలాంటి నెగెటివిటీ ఇతర హీరోలకు జరిగి ఉంటే ఖచ్చితంగా మ్యాట్నీ షో నుండే థియేటర్ మొత్తం ఖాళీ అయ్యేది. కానీ అందుకు భిన్నంగా దేవరాజు సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.



ఇప్పుడు దేవర ఇచ్చిన సక్సెస్ తో ఎన్టీఆర్ మరో రెండు చిత్రాలలో నటించబోతున్నారు .ఒకటి ప్రశాంత్ నీల్ తో మరొకటి బాలీవుడ్లో డేబ్ల్యూ మూవీ వార్ -2. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని నెలల క్రితమే కొంత భాగం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను హృతిక్ రోషన్ , అలాగే ఇతర నటీనటులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా వార్-2 సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారట. ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో నటించడానికి కాస్త మక్కువ చూపుతున్నట్లు సమాచారం.


అక్టోబర్ రెండవ వారంలో ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులోని పాటలు డాన్స్ కూడా హైలెట్గా నిలవబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒకే ఫ్రేమ్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కనిపించబోతున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్టర్ ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి మరి. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించడంతో దర్శక నిర్మాతలు క్యూపడుతున్నారు.మొదటిసారి స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ఇలాంటి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.. మరి ఏ మేరకు ఎన్టీఆర్ కెరియర్ కు ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: