మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రగ్యా జైస్వాల్ , అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత ఈమె వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న చాలా వరకు ఈమె నటించిన సినిమాలు విజయాలను అందుకోలేదు. అలాంటి సమయం లోనే ఈమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్య , బాబి కాంబోలో పొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలయ్య , బోయపాటి కాంబోలో మరి కొంత కాలంలో స్టార్ట్ కాబోయే సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: