ఆ క్రమంలోనే తనని తెల్లగా లేవని చాలా మంది విమర్శించారని ఒక షాంపూ ఆడిషన్ కోసం వెళ్లగా.. అక్కడ కూడా బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా తనని పనికిరావంటూ చాలా అవమానించారట .దీంతో ఇంటికి వెళ్లి మరి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని చాలా సార్లు ఏడ్చే చేశానంటూ తెలియజేసింది శోభిత. అలాంటి నెగెటివిటీల నుంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టిందని అలా తన కెరియర్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నటిగా మారడం అంత ఈజీ కాదని కూడా తెలియజేసింది శోభిత.
అయితే ఈ అవమానాలే తనని ఈ స్థాయిలో నిలబెట్టాయని కూడా తెలిపింది. ఇవన్నీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. శోభిత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ కూడా లేదు ఈమె తల్లి టీచర్ ,తండ్రి నేవీ ఆఫీసర్ మాత్రమే.. శోబిత కుటుంబం మొత్తం కూడా తెలుగువారే.. శోభిత బాలీవుడ్ నుంచి తెలుగు పరిశ్రమకు అడుగుపెట్టడంతో ఈమె అంతా బాలీవుడ్ బామ్మ అనుకుంటున్నారు. అయితే శోభిత మాత్రం అచ్చ తెలుగు అమ్మాయి.. శోభిత చెల్లెలు సమంత .. శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారాయి. ఏది ఏమైనా శోభిత పడ్డా అవమానాలు తన సినీ కెరియర్ని నిలబెట్టాయి. ఈ విషయాలు విన్న అభిమానులు ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.